ఓం శ్రీ మాత్రే నమః

శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం

(వసంత - R.వసంత - T.కొత్తూరు) Reg No: 65/2025

శ్రీ శ్రీ శ్రీ పోలమ్మ తల్లి

శ్రీ పోలమాంబ ఆలయం పుణఃనిర్మాణం జరుగుచున్నది కావున విరాళాలు ఇవ్వదలచుకున్న వారు ఈ కమిటీnumbers: 9494014421 / 9849083367 ని సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము

Total Donations: 900359     Total Expendature: 904258     Total Balance: -3899

శ్రీ శ్రీ శ్రీ పోలమ్మ తల్లి ఆలయం వసంత గ్రామంలో పినచెరువు గట్టు మీద ఎప్పుడు నిర్మించారో తెలియదు కానీ సుమారు 200 సంవత్సరాల క్రిందట నిర్మించబడి ఉందని స్థానికంగా ఊరులో ఉన్న గ్రామ పెద్దలు చెప్పటం జరిగింది.ఈ గ్రామ దేవత శ్రీ పోలమాంబ అమ్మవారిని వసంత గ్రామ ప్రజలతో పాటు ప్రక్క గ్రామాలైన చిన్న వసంత మరియు కొత్తూరు ప్రజలు కూడా పూజిస్తారు. అమ్మవారి సంబంధించి జరిగే పూజలు, పండుగలు మరియు ఉత్సవాలలో వారు కూడా పాలుపంచుకుంటారు.

అమ్మవారి చరిత్ర:

ఒకానొక కాలంలో ఒక రైతు పోతుల బండిమీద వడ్లు జొన్నలు తీసుకుని సాలూరు నుండి కొత్తవలస మీదగా అనకాపల్లి చేరేందుకు వెళుతుండగా సరిగా అమ్మవారి గుడి సమీపన ఆ దున్నపోతు తల కింద పడిపోయింది అప్పుడు రైతు ఏమి చేయాలో తోచని పరిస్థితిలో శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం కనిపించింది అమ్మవారిని తన బండిని తన గమ్యానికి చేర్చమని అమ్మవారి మొక్కుకొని అక్కడే ఆ రైతు నిద్రపోయాడు. అప్పుడు అమ్మవారు రైతుకి కలలో కనిపించి తన దున్నపోతు మొండెమును యధావిధిగా పూజకు కట్టమని చెప్పారట. ఇంకా గ్రామంలో నాకు అక్క చెల్లెల్లు అయిన గ్రామ దేవతలు పోర్లమ్మతల్లి, బంగారమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పరదేశమ్మ తల్లి మరియు మరిడమ్మ తల్లికి పసుపు కుంకుమ లు సమర్పించి తదుపరి నాకు పండుగ చేయమని అమ్మవారు కోరారని ఆ భక్తుడు తెలిపాడు. ఉదయం నిద్ర లేచి చూడగా దున్నపోతు తల అమ్మవారి ఆలయనంకు పక్కన ఉన్న మడిలో ఒక శిలగా మారింది. అప్పుడు అమ్మవారు కలలో చెప్పిన విధంగా దున్నపోతు మొండెమును యధావిధిగా పూజకు కట్టిన తరువాత అమ్మవారి మహిమ వలన ఆ బండి యధావిధిగా గమ్య స్థానంకి చేరిందని ఆ భక్తుడు చెప్పాడు. అప్పటి నుండి అమ్మవారు కోరిన విధంగా పండుగను జరిపిస్తున్నారు.

పండుగ జరుగు విధానం:

పసుపు - కుంకుమ లు సమర్పించుట:

ముందుగా గ్రామ దేవతలైన పోర్లమ్మతల్లి, బంగారమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పరదేశమ్మ తల్లి మరియు మరిడమ్మ తల్లికి పసుపు కుంకుమ లు సమర్పిస్తారు. తరువాత పోర్లమ్మ తల్లికి పూజలు చేసి అమ్మవారి పండుగను ఆరంభిస్తారు. ముత్యాలమ్మ అమ్మవారి ముందు రోలు పెట్టి పూజిస్తారు.

సిరిమాను తీసుకురావటం:

పూజారి గారికి అమ్మవారు కలలో కనిపించి తన సిరిమాను ఉత్సవమునకు తగినటువంటి చెట్టు ఏ దిక్కున ఏ ప్రదేశం లో ఉందోఅని తెలుపుతుంది. అప్పుడు గ్రామ ప్రజలు ఆ ప్రదేశమునకు వెళ్లి ఆ గ్రామ ప్రజలు మరియు చెట్టు యజమానికి తెలిపి ఆ చెట్టుకు పూజలు చేసి అక్కడ నుంచి మేళతాళాలతో ఆ చెట్టుని గ్రామానికి తీసుకొనివస్తారు.

చూలాలు పండుగ:

ఉత్సవంలో మొదటగా చూలాలు పండుగ జరుగుతుంది, చూలాల పండుగ అమ్మవారి పండుగ కి సమానప్రియం. వివిధ కుటుంబాల వారికీ ఈ ఉత్సవం లో భాగస్వామ్యం ఉంటుంది. అందులో భాగంగా రథాల పోలయ్య వారి కుటుంబీకులు ఉపవాసంతో చూలాలను తెచ్చి పండుగ అయినంతవరకు వారి ఇంటి వద్ద ఉంచుతారు. తరువాత ఆ చూలాలను వెతికే సందర్భాలు ఈ పండుగలో చాల ముఖ్యమైన ఘట్టాలు.

అమ్మవారి పండుగ - సిరిమానోత్సవం:

సిరిమానోత్సవం ఈ పండుగలో ఒక అద్భుతమైన ఘట్టమని చెబుతుంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల పండుగలలో ఎక్కడ కూడా సిరిమాను నిటారుగా ఉండదు. కానీ పోలమ్మ తల్లి పండుగ సిరిమాను మాత్రం నిటారుగా చాలాఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ సిరిమాను రథాల కుటుంబానికి చెందిన వారు మాత్రమే అధిరోహించాలని అమ్మవారు చెప్పారని గ్రామస్తులు తెలిపియున్నారు. అలాగే కొమ్మినేని వారు ఘటాలు ఎత్తుకుంటారు. అలాగే రధంపై మొదటగా ముత్యాల గారి కుటుంభం వారు నీరు పోసి పూజిస్తారు. పద్మశాలి కులస్థులు ప్రభను పట్టుకుంటారు. ఈ పండుగ లో ముఖ్యమైన ఘట్టం లో భాగంగా ఒక ఆడగొర్రె ప్రేగులు తీసి వసంత శివమణి కి పెడజంధ్యం వేస్తారు. అతను ఉరిపొలిమేరను చుట్టివచ్చినంతవరకు అమ్మవారి మహిమతో ఆ గొర్రె ప్రాణంతో ఉంటుంది.
ఇలా అమ్మవారి పండుగను జరుపుకొనుట వలన అమ్మవారి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తున్నారని గ్రామప్రజలు నమ్మకం.